calender_icon.png 13 July, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు

12-07-2025 08:35:49 PM

రాహుల్, రేవంత్ రెడ్డి, పొన్నం, కవ్వంపల్లి ఫ్లేక్సీలకు పాలాభిషేకం

తిమ్మాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై శనివారం తిమ్మాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై పటాసులు కాల్చి స్వీట్లు పంచారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేష్లను ఆర్డినెన్స్ ద్వారా సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు నిర్ణయం చారిత్రాత్మకమైనదని, దీని వల్ల వల్ల బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అణగదొక్కబడ్డ బీసీలకు కాంగ్రెస్ పాలనలో న్యాయం దక్కిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు పెంచిన రిజర్వేషన్లకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తగ్గించి అన్యాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.