12-07-2025 08:22:52 PM
ఎన్ఓపిఆర్యూఎఫ్ దక్షిణ భారత ఇంచార్జ్ మాచన రఘునందన్
హైదరాబాద్: భాగస్వామ్య పింఛను పథకం తో పాటు తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపిఎస్)లను రద్దు చేయాలని కోరుతూ..దేశ వ్యాప్తంగా సి పి ఎస్ ఉద్యోగ శ్రేణులు మొక్కలు నాటినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేషన్ యునైటెడ్ ఫ్రంట్(ఎన్ ఓపిఆర్యూఎఫ్)దక్షిణ భారత ఇంచార్జ్ మాచన రఘునందన్ చెప్పారు. శనివారం రఘునందన్ హైదరాబాద్ లో తన నివాసంలో మొక్క నాటారు.
ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉద్యోగ వర్గాలు తమకు భాగస్వామ్య పింఛను పథకం వద్దు, పాత పింఛను పథకం కావాలని ముక్త కంఠంతో ఘోషిస్తున్నారని మాచన రఘునందన్ చెప్పారు. ఇందుకోసం ఉద్యమ స్పూర్తి తో ప్రతి రాష్ట్రం లో ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు వ్యతిరేకంగా.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం మొక్కలు నాటినట్టు వివరించారు.జూలై 20 న వారణాసి లో జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు మాచన రఘునందన్ వెల్లడించారు.