calender_icon.png 13 July, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభం

12-07-2025 08:29:54 PM

వీర్నపల్లిలో పలు పనుల పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వీర్నపల్లి,(విజయక్రాంతి): వీర్నపల్లి మండల కేంద్రంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర్నపల్లి మండల కేంద్రంలో చేపడుతున్న రహదారి పనుల పరిశీలించారు. అనంతరం రంగంపేట గ్రామ శివారులోని జంపన్న వాగును సందర్శించి, పూడిక తీసి, నీరు నిలువుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈజీఎస్ లో భాగంగా అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.