12-07-2025 08:08:06 PM
జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే(Minister Eshwara Khandre) ప్రత్యేక పూజలు చేశారు. శనివారం శ్రీ దత్తగిరి మహారాజ్ అమరచితి సందర్భంగా ఆశ్రమంలో యజ్ఞ యాగాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్ణాటక మంత్రి ఈశ్వర్ వచ్చారు. 12 జ్యోతిర్లింగాలకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామని ఒక్క వెయ్యి ఎనిమిది మహారాజ్ మంత్రి ఈశ్వర్ ను సన్మానించి ప్రసాదం అందజేశారు. అనంతరం మహా యజ్ఞంలో పాల్గొన్నారు. ఆలయానికి రాగానే దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పిఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.