12-07-2025 08:22:09 PM
ఖేడ్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం..
పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ, ఖేడ్, పరిగి ఎమ్మెల్యేలు..
నారాయణఖేడ్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్(MP Suresh Kumar Shetkar), పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, టీజీ ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిలు శనివారం నారాయణఖేడ్ పట్టణంలోని స్థానిక సాయిబాబా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు అన్నారు. ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచ్ స్థానాలను పూర్తిస్థాయిలో దక్కించుకోవాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని అన్నారు.
రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, మహిళలకు, యువకులకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తల విజయానికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, టి పి సి సి సభ్యులు శంకరయ్య స్వామి, సుధాకర్ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కార్, యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ శేఖర్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు భోజిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సేట్, మైనార్టీ నాయకులు తాహెర్ అలీ తదితరులు పాల్గొన్నారు.