24-01-2026 12:00:00 AM
సాత్నాల ప్రాజెక్టులో రొయ్యల సీడ్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): మత్స్యకారులకు ఉపాధి అవకాశా లు కల్పించేందుకే చేపల, రొయ్యల పెంపకం జరుగుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం సాత్నాల మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొ న్న ఆయన సాత్నాల ప్రాజెక్టులో రూ.3 లక్షల విలువ చేసే రొయ్య పిల్లల (రొయ్య సీడ్) ను ఎమ్మెల్యే విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... చేప, రొయ్య పిల్లల విడుదల కార్యక్రమాలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సకాలంలో చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమాలు ఆలస్యం అయితే మత్స్యకారుల జీవనాధారంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశ ముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇటీవల మత్స్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన కేజ్ వీల్ సాంకేతికతను సద్వినియో గం చేసుకుంటూ, ఈ సాంకేతికతను సాత్నా ల, మత్తడి వాగు ప్రాజెక్టు, పెండల్ వాడ చెరువుల్లో అమలు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అవసరమైన నిధులు సాధించి చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయడంతో పాటు, మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంలో తనవంతు బాధ్యతగా పని చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, సుభాష్, పోతురాజు రమేష్, గంభీర్, స్వామి, గోపతి ప్రమోద్, రవి, రమేష్. తదితరులు పాల్గొన్నారు.