calender_icon.png 31 August, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ ముసాయిదాపై రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం

30-08-2025 05:24:38 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేసి, రాజకీయ పార్టీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శనివారం అశ్వాపురం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో గద్దల రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా రూపొందించామని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ వార్డుల వారీగా జాబితాను సిద్ధం చేసి సంబంధిత కార్యాలయాలలో ఉంచినట్లు వివరించారు. అన్ని పార్టీ నాయకులు జాబితాను పరిశీలించి, సూచనలు అందించాలని ఆయన కోరారు.