calender_icon.png 29 September, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ది నుంచి స్పెషల్ పోస్టర్

29-09-2025 12:33:08 AM

రామ్ చరణ్ తన 18 ఏళ్ల కెరీర్లో ప్రతిష్టాత్మక పాత్రల్లో ఒకటిగా నిలిచే ’పెద్ది’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రగ్గడ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథతో వుండబోతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, రామ్ చరణ్, ఇతర ప్రధాన తారాగణం షూటింగ్ లో పాల్గొంటున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నారు. ’చిరుత’ 2007, సెప్టెంబర్ 28 విడుదల)తో చిత్రపరిశ్రమలో అరంగేట్రం చేసిన చరణ్ 18 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ’పెద్ది’ టీమ్ ఆ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ చరణ్ ని మాస్, ఇంటెన్స్ లుక్లో ప్రజెంట్ చేస్తోంది. రైల్వే ట్ప్రా ఒంటరిగా నిలబడి, భుజంపై బ్యాక్ప్యాక్ వేసుకుని, వేళ్ల మధ్య బీడీతో చరణ్ మాస్ వైబ్ అదిరిపోయింది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. 2026, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కానుంది.