26-12-2025 12:51:14 AM
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
ఏసుక్రీస్తు బోధనలు ఆరాధనలతో మార్మోగిన చర్చిలు
మిడ్జిల్ డిసెంబర్ 25 : మండలంలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు వాడియాల్, మున్నానూర్, వస్పుల, తోపాటు పల్లెలోని చర్చిల్లో వేస్తావులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏసుప్రభు ను కొలుస్తూ భక్తులు ఆలపించిన దేశభక్తి గీతాలు కీర్తనలు అలరించాయి.
మున్ననూర్ గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి సుజాత మల్లికార్జున్ రెడ్డి చర్చి పాస్టర్ సువార్త రాజును ఘనంగా సన్మానించి చర్చి అవసరాలకు 50 వేల రూపాయలు చర్చి అవసరాలకు గ్రామ నాయకులతో కలిసి అందించారు. ఏఎంసీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు చర్చిలకు వెళ్లి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 25: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డీసీసీ మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ కాలనీలోని తన నివాసంలో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ పాల్గొని బెనహర్ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ. క్షమ, సేవ, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, జహీర్ అఖ్తర్. ఏపీ.మిథున్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ, మధుసూదన్ రెడ్డి, శేఖర్ నాయక్, సీబీ శ్రీపూజిత , బి.సన్నీ రాజ్, కవిత , శోభన్, గ్రేస్, ఆనంద్, రామకృష్ణ, వినయ్ పాల్గొన్నారు.
అయిజలో
అయిజ, డిసెంబర్ 25 : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని ఎం బి బేతేల్ ప్రార్థన మందిరంలో గురువారం క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.పాస్టర్ సీమోను మరియు సంఘస్తులు ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ కేక్ కట్ చేశారు.అనంతరం దైవ సేవకులు సీయోను మాట్లాడుతూ...యేసు క్రీస్తు జనన ప్రాముఖ్యత వివరించారు.
చర్చిలోని క్రైస్తవులందరు ఒకరికొకరు క్రీస్తు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాస్టర్ సీమోను మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న బెత్లహేములోని పశువుల పాకల జన్మించినాడని అందుకు గుర్తుగా ఈ రోజున క్రీస్తు జన్మదినంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ జరుపుకుంటారు అని అన్నారు.
అచ్చంపేటలో
అచ్చంపేట డిసెంబర్ 25: క్రీస్తుభోధనలు.. ప్రతి ఒక్కరికి ఆచరణీయమని వక్తలు కొనియాడారు. ఆయన చూపించిన ప్రేమ మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు. అచ్చంపేటలోని వివిధ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకు కోసి.. ఒకరికొకరు పంచుకున్నారు. ఏసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని షాలెం ఎంబీ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
చర్చి పాస్టర్లు నిర్వాహకులు పాల్గొన్నారు. వెల్దండ మండల కేంద్రంలోని చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎం.బి చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.