calender_icon.png 26 December, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లను పెంచాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

26-12-2025 12:50:36 AM

వచ్చే అసెంబ్లీలో రిజర్వేషన్లపై చర్చ జరిపి చట్టబద్దంగా అమలు చేయాలి

సీఎంకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ

ముషీరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలు ముగి శాయి. ఇంకా జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు కూడా త్వరలో జరుగుతాయని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. బీసీసలు సర్పంచ్ ఎన్నికలలో 51 శాతం విజయం సాధించారు. అయిన ప్రభుత్వానికి సిగ్గు లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. వచ్చే అసెంబ్లీలో రిజర్వేషన్లపై చర్చ జరిపి చట్టబద్దంగా అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందని ఆయన గురువారం విద్యానగర్లోని బీసీ భవన్ లో వెల్లడించారు.

అయితే జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు మాత్రం పార్టీ ప్రతికగానే జరుగుతాయి కాబట్టి చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్లను 42 శాతంకి పెంచిన తర్వాతనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రతిపదికగా కాకుండా స్వతంత్రంగా జరుగుతాయని ఉదారంగా యున్నారు. కానీ ఇప్పు డు ఎట్టి పరిస్థితులలో 42 శాతంకు పెంచే వరకు వదిలిపెట్టి ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా 42 శాతంకు పెంచి న తర్వాతనే ఎన్నికలకు వెళతామని కొన్ని వందలసార్లు ప్రకటించి మోసం చేసి ఎన్నికలకు వెళ్లారన్నారు. బీసీలకు అన్యాయం చేశారు.

42 శాతం ప్రకటించి మరలా దాని ని 22 శాతం తగ్గించి ఆచరణలో 17శాతం తగ్గించి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఇది చాల దుర్మార్గ మాని ప్రభుత్వ ఎంత తగ్గించి అన్యాయం చేయాలనీ చూస్తుంటే బీసీలు తిరగబడి మొత్తం సీట్లలో 51శాతం సర్పంచ్ పదవులు బి.సి.లు స్వాదీనం చేస్తున్నారన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థలలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధ, చట్టబద్ధత, న్యాయబద్ధత ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-ౄ-6 ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికి ఢిల్లీకి 62 సార్లు వెళ్లారు. ఒక్కసారి కూడా బీసీల గురించి ప్రధానమంత్రికి కలవలేదు.

కనీసం అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకు వెళ్లలేదన్నారు. ఈ దఫా కోర్టులో కేసులు వాదించాడానికి సీనియర్ ప్రాముఖ్యత గల జాతీయ స్థాయి గుర్తింపులో అడ్వకేట్లను నియమించాలన్నారు. హైకోర్టులో వేసి మొత్తం 62 కేసులను వివరంగా చర్చించాలన్నారు. కేసు బలంగా అయింది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జీవో 9 యుం ది. కాబట్టి పెంచిన రిజర్వేషన్ల కేసు గెలుస్తుంది. చివరిదాకా పోరాడాలి. గెలవని పక్షంలో రాజ్యాంగ సవరణ కోసం పోరాడాలన్నారు.