07-08-2025 10:46:15 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) భీమిని మండలంలోని చిన్న తిమ్మాపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం వీచిన గాలివాన తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. పెద్ద ఎత్తున గాలితో కూడిన వర్షం రావడంతో గ్రామంలోని పలువురి ఇల్లు ధ్వంసమయ్యాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు ఇళ్లపై నేలకొరిగాయి. పలువురి ఇళ్లపై రేకులు లేచిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన గాలివాన బీభత్సం గ్రామంలో భయోత్పాతాన్ని సృష్టించింది. అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.