07-08-2025 10:43:37 PM
- ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేయాలి
- అంకితభావంతో విధులు నిర్వహించాలి
- సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి..
సిద్దిపేట క్రైమ్: పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి(ACP Ravinder Reddy) పోలీసులకు సూచించారు. గురువారం ఆయన బెజ్జంకి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఎవరెవరు ఏఏ విధులు నిర్వహిస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేయాలని రిసెప్షనిస్ట్ కు సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ముందస్తు సమాచారాన్ని సేకరించాలని, విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శించాలని ఆదేశించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వారంలో రెండు, మూడు సార్లు గ్రామాలను సందర్శించాలని, పాత నేరస్థులపై నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు.