07-08-2025 10:29:39 PM
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ ఎస్సీకాలనీ, కుంచమర్తి తదితర గ్రామాల్లో గురువారం బోనాల పండుగను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పులతో గ్రామ మహిళలు, ఆడపడుచులు బోనమెత్తి, టెంకాయలు కొట్టి ముత్యాలమ్మకు తమ మోక్కులను సమర్పించుకున్నారు. తల్లి పిల్లలు సల్లగా ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. వర్షాలు పడి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. గ్రామ దేవతలు ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని పూజించారు.