07-08-2025 10:31:34 PM
బిఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): అర్హులైన ప్రతీ ఒక్కరు సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ(BRS leader Shambipur Krishna) సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంజూరు చేయించిన రూ.4,16,500/- సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధిత 12 చెక్కులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ, ఆపదలో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బుచ్చి రెడ్డి, కొర్ర శంకర్ నాయక్, సాయి యాదవ్, సుధాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, సీనియర్ నాయకులు పాల్పనూరి దర్శన్ రెడ్డి, ఆకుల బాబు, మల్లేష్, సాయి ముదిరాజ్, నిజాంపేట్ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.