07-08-2025 10:28:17 PM
ఎమ్మెల్యే కెపి.వివేకానంద్..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకునేందుకు కంప్యూటర్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో కీలకమని, అధునాతన పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు వారికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, నాయకులు బాలేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.