31-07-2025 11:49:24 PM
ప్రసాద్ రెడ్డి, దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు
కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం సాయి మందిరంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముందుగా దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం నాడు దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. దాతలను దేవాలయ చైర్మన్ ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనిల్ బాబు, ఏదులాపురం శ్రీనివాస్ రావు, శరబయ్య, అర్చకులు సాయి శర్మ, కోళ్లూరి శేషు పాల్గొన్నారు.