01-08-2025 12:00:00 AM
- ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి రూ.4 లక్షల గ్రీన్ బోర్డుల పంపిణీ
ఇబ్రహీంపట్నం జూలై 31:బిఆర్‌ఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమనీ ఉప్పరిగూడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి కొనియాడారు. గురువారం బిఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, ఉప్పరిగూడ మాజీ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాలలకు గ్రీన్ బోర్డులు పంపిణీ చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్ మెట్టు మండలాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బూడిద రామ్ రెడ్డి సుమారు రూ.4 లక్షల విలువైన గ్రీన్ బోర్డులు అందించడం జరిగింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు, దాత బూడిద రామ్ రెడ్డి మాట్లాడారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి బూడిద రామ్ రెడ్డి ని ఘనంగాసన్మానించారు.