22-07-2025 12:00:00 AM
రాజాపూర్ జూలై 21: గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను తీర్చేందుకు పెట్టేందుకు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్ అన్నారు. సోమవారం రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో బోరు వేయించినట్లు ఏఎంసీ వైఎస్ చైర్మన్ జవాజి శేఖర్ గౌడ్ తెలిపారు.
ఖానాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు బోరు డ్రిల్లింగ్ వేయడంతో పుష్కలంగా నీరు వచ్చినట్టు తెలిపారు. గ్రామంలో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి జనంపల్లి శశికళ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్, వెంకటేశ్వర రెడ్డి, మహిపాల్ రెడ్డి, నారాయణ నాయక్, మోటె సత్యం, రాములు, సత్యం తదితరులుపాల్గొన్నారు.