calender_icon.png 22 January, 2026 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో స్పైన్ సర్జరీ టెక్నాలజీ సదస్సు

19-09-2024 01:07:23 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): న్యూరో-స్పున్ సర్జన్ అసో సియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఎస్‌ఎ) 27వ వార్షిక సమావేశం గురు వారం నుంచి ఈనెల 22 వరకు నాలుగు రోజుల పాటు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో నిర్వహిస్తున్నారు.  దేశంలోని 450కు పైగా స్పున్ సర్జరీ నిపుణులు పాల్గొని ఈ రంగంలో నూతన పోకడలపై చర్చిస్తారు. స్పున్ సర్జరీని ఆప్టిమైజ్ చేయడం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల ద్వారా శస్త్రచికిత్సా ఫలితాలను మెరుగుపరచడం తదితర అంశాల ఇతివృత్తంగా సమావేశం సాగుతుంది. సమావేశంలో కొరియన్ స్పునల్ న్యూరోసర్జరీ సొసైటీ, బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ స్పున్ సర్జన్స్, బ్రెజిలియన్ స్పున్ సొసైటీకి చెందిన వైద్యులు సైతం పాల్గొని అత్యాధునిక వైద్య విధానాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.