14 August, 2026 | 1:33 AM

పోలీసుల దృఢత్వానికి క్రీడలు అవసరం

14-08-2026 12:00 AM

నాగర్‌కర్నూల్ ఆగస్టు 13 (విజయక్రాంతి): విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు అధికారులు, సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వం కోసం క్రీడల్లో పాల్గొనడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బంది కోసం రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్తో కలిసి ప్రారంభించారు.

క్రీడలతో శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటే విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయగలరని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు స్వయంగా షటిల్ ఆడి పోలీసు సిబ్బందిలో ఉత్సాహం నింపారు. అనంతరం పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.  అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అర్చన, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, సీఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.