calender_icon.png 23 December, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్ నాయక్ తండా సర్పంచ్ గా దూరిబాయి

22-12-2025 10:34:14 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని లక్ష్మణ్ నాయక్ తండాలో నూతన పంచాయతీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఎంపీఓ బ్రహ్మయ్య నూతన సర్పంచ్ మూడ్ దూరిబాయి, ఉప సర్పంచ్ నందు నాయక్, వార్డు సభ్యులచే ప్రతిజ్ఞ చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన బాధ్యతను గుర్తెరిగి, రాజకీయాలకు అతీతంగా తండా అభివృద్ధికి కృషి చేస్తామని నూతన సభ్యులు వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తండా వాసులు, తండా పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.