calender_icon.png 10 January, 2026 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసిక ఉల్లాసం

10-01-2026 12:23:17 AM

సీఎం కప్ టార్చ్ ర్యాలీలో కలెక్టర్ 

మంచిర్యాల, జనవరి 9 (విజయక్రాంతి) : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా అన్ని రంగాలలో ఆత్మస్థైర్యంతో రాణించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం సిఎం కప్ క్రీడలు 2025లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో డిసిపి ఎగ్గడి భాస్కర్, ఎసిపి ప్రకాష్, జిల్లా యువజన క్రీడా సేవల శాఖ అధికారి హనుమంత రెడ్డి, ఇతర అధికారులు, క్రీడాకారులతో కలిసి టార్చ్ ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ క్రీడల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సి ఎం కప్ 2025 2వ ఎడిషన్ క్రీడా పోటీలను జిల్లాలో విజయవంతం చేయాలని తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని, చేసే ప్రతి పనిలో ఏకాగ్రత పెరుగుతుందని, అన్ని రంగాలలో రాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు రఘునాథ్, సంబంధిత అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.