17-05-2025 01:22:47 AM
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): రాష్ట్రం దివాళా తీసిందని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడినా ఈ అంశంపై ఆర్థిక శాఖను చూసే డిప్యూటీ సీఎం భట్టి కనీసం స్పందించకపోవడం చూస్తుంటే, వీరి మధ్య విభేదాలున్న ట్టు స్పష్టమవుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కాకుండా అడ్డుకుంటున్నదే రేవంత్‌రెడ్డి అం టూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన ని వాసంలో ఏలేటి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని సీఎం ప్రయత్నిస్తున్నారని, అందుకే ఈ రంగంలో నిష్ణాతులైన రామకృష్ణారావును ఏరికోరి సీఎస్‌గా తెచ్చుకున్నారన్నారు. మొద ట సంక్షేమ పథకాలకు గండికొట్టి, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందన్నారు.
ఉద్యోగులపై సీఎం చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్గంలో సైతం పెద్దఎత్తున విభేదాలు వచ్చాయన్నా రు. కేబినెట్ భేటీల్లో ముఖ్యమంత్రిని మంత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రికి, హైకమాండ్‌కు మధ్య గ్యాప్ కొనసాగుతుందని.. ఇటీవల రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినా రేవంత్‌తో మాట్లాడలేదన్నారు. ముఖ్యమంత్రి మీద వస్తోన్న అనేక ఆరోపణల ఫైల్ రాహుల్ దగ్గర ఉందని..
ఇక్కడి నుంచి మంత్రులు రెగ్యులర్‌గా రేవంత్‌పై అధిష్ఠానానికి నివేదికలు పంపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం దివాళా తీసిందని, చెప్పుల దొం గలుగా భావిస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీలోని నేతలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. కనీసం మంత్రులకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని... సమీక్షలన్నీ సీఎం నివాసంలో ఏర్పాటు చేయ డంతో ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు అయిష్టంగా వెళ్తున్నారని తెలిపారు.