02-01-2026 12:00:00 AM
అమీన్ పూర్, జనవరి 1 :అమీన్ పూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీరంగూడ గు ట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో త రలివచ్చారు. ఉదయం నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో గురువరాం ఆలయంలో జరిగే అభిషేకాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధి కారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.