02-01-2026 12:00:00 AM
ఖమ్మం, జనవరి 1 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి ఆధ్వర్యంలో కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్‌ను గురు వారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీజీ వో నూతన క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్‌ను కలెక్టర్‌చే ఆవిష్కరించారు. తర్వాత టీజీవో జిల్లా కార్యాలయంలో నూతన సం వత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు కొండపల్లి శేషు ప్రసాద్, హౌస్ బిల్డింగ్ సొసైటీ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు ఉషశ్రీ, కార్యదర్శి సుధారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు కనపర్తి వెంకటేశ్వర్లు, రమేష్, సతీష్, భాస్కర్, తాజుద్దీన్, అరుణకుమారి, మంజుల, వరప్రసాద్, శారద, ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నవీన జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి దన్సరి పుల్లయ్య, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి నాగేశ్వరరావు, డిగ్రీ కళాశాల అధ్యాప కులు బానోత్‌రెడ్డి, బూరుగు శ్రీనివాసు, కుక్కల కార్తీక్, రవికుమార్, పల్లా శ్రీనివాస్, రామచందర్ డాక్టర్ రవి కిరణ్, ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు.