calender_icon.png 2 January, 2026 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవిత లక్ష్యం ఏర్పరచుకోవాలి

02-01-2026 12:00:00 AM

  1. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ దాసేశ్వరరావు 
  2. యూనివర్సిటీలో నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని విజ్ఞాన్స్ యూనివ ర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో గు రువారం నూతన సంవత్సర వేడుకలు ఘ నంగా జరిగాయి.

వేడుకల్లో దాసేశ్వరరావు పాల్గొని, కేక్ కట్ చేసి, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేవలం పట్టాలు పొందడమే విద్య ఉద్దేశ్యం కాదని, విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడమే విద్య ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యా లను పెంపొందించుకోవాలని సూచించారు.