09-05-2025 01:19:08 AM
అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు
గజ్వేల్, మే 8 : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజ్ పూర్ గ్రామంలో అతి పురాతన, పునర్నిర్మాణమైన వరదరాజ స్వామి ఆలయంలో శ్రీ భూనీల సమేత వరదరాజ స్వామి దేవతామూర్తుల పున ప్రతిష్ట గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా గురువారం కుంభారాధనములు, వేద విన్నపములు, మూలమంత్ర హోమములు, ప్రాయశ్చిత్త హోమములు, ద్వారాతోరణ బలి, మహా పూర్ణాహుతి, కుంభయాత్ర, శాంతి కళ్యాణం నిర్వహించారు.
భక్తులకు శ్రీ భూనీల సమేత వరదరాజ స్వామి ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు.స్వామివారి సేవలో భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ నినాదాలతో ఒకసారిగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గోపాలకృష్ణ, ఆలయ పురోహితులు వరదాచార్యులు, శ్రీనివాసా చార్యులు, వేణుగోపాలా చార్యులు, పురుషోత్త మచార్యులు, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి,మాజీ మండల కోఆప్షన్ సభ్యులు లక్కాకుల సాహెరా నరేష్,మాజీ గ్రామ సర్పం ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపిటిసి ధనలక్ష్మి కృష్ణ, కృష్ణ, నాయకులు సాయిని మహేష్,సుధాకర్ రెడ్డి,అతని నర్సింలు, శ్రీశైలం, రాజు, కనకయ్య, వివిధ శాఖల అధ్యక్షులు, గ్రామస్తులు, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.