calender_icon.png 9 May, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలి

09-05-2025 01:17:51 AM

-అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్

 కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 8(విజయ క్రాంతి):రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని  రైస్ మిల్లులకు త్వరగా తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్  ఎం. డేవిడ్ అన్నారు. గురువారం-కౌటాల మండలం సాండ్ గాం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియ, రిజిస్టర్ నిర్వహణ, తూకం యంత్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొను గోలు చేస్తుందని తెలిపారు. రైస్ మిల్లర్లు  ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకొని వాహనాలను తిరిగి పంపించాలని, తూకంలో కోత లేకుండా చూడాలని తెలిపారు.

అకాల వర్షాలు, ఎండ తీవ్రత ఉన్న దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, గోనె సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బం-దులు తలెత్తకుండా త్రాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

ధాన్యంలో తాలు, దుమ్ము లేకుండా నిబంధనల ప్రకా రం తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పిం-చాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సహాయ పౌరసరఫరాల శాఖ అధికారి సాదిక్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, ఐకెపి. ఏపి. ఎం. ముక్తేశ్వర్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సం బంధిత అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో ధాన్యం అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుం-దని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు.

గురువారం జిల్లాలోని సిర్పూర్ - టి మండలం వెంకటరావుపేట గ్రామంలో మహారాష్ట్ర సరిహద్దులో వెంకట్రావుపేట- పొడ్సా వంతెన వద్ద సరిహద్దు చెక్పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి వరి ధాన్యం జిల్లాలోకి రాకుండా, సన్న బియ్యం అక్రమ రవాణా జరగకుండా విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే పోలీస్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ పౌరసరఫ-రాల అధికారి సాధిక్, ఎన్ఫోర్స్మెంట్ డి. టి. శ్రీనివాస్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.