14-08-2025 07:10:32 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం కనకాపూర్ అక్షర ప్లే స్కూల్లో(Akshara Play School) గురువారం శ్రీకృష్ణాష్టమి(Krishna Janmashtami) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు కృష్ణుడు గొల్లభామల వేషధారణ ధరించి నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నరేష్ రెడ్డి ప్రిన్సిపల్ రాజారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.