calender_icon.png 17 May, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహావిష్కరించిన శ్రీ నిజగుణనంద స్వామి

17-05-2025 06:58:23 PM

నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగల్ గిద్ద మండల కేంద్రంలో శనివారం రోజు బసవేశ్వర కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన శ్రీ నిజగుణనంద స్వామి, డిసిసి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహ దాత సభద్యక్షులు విజయ్ కుమార్ ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో మండల  నలుమూలల నుంచి ప్రజలు రాజకీయ దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ నిజగుణనంద స్వామి పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం సభలో వారు మాట్లాడుతూ.. అంటరానితనంపై అలుపెరుగని సమరం అంబేద్కర్ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిది అని అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయిందనీ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్.. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేని పెరన్నారు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది.

అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని నిజాగుణనంద స్వామి తెలిపారు కార్యక్రమంలో  అంబాదాష్ మహారాజ్, ఎంపీడీవో మహేశ్వరరావు,  నాగిశెట్టి పాటిల్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమ్యాల మాణిక్యం, మండల నాయకులు గుండేరావు పాటిల్, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్, జిఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రపుమచందర్ ,  మాజీ జడ్పీటీసీ రాజు రాథోడ్, ఎస్సై బి.సాయిలు, సంజీవ్ రావు పాటిల్, అంబేద్కర్ పూలే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రహీం ,కార్యదర్శి వై పండరి, గణపతి, తదితరులు పాల్గొన్నారు.