calender_icon.png 17 May, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటూరు బొడ్రాయికి ఊరేగింపులో జలాభిషేకాలు

17-05-2025 06:54:05 PM

నాగారం: నాగారం మండలం ఈటూరు అత్యంత వైభవోపేతంగా గ్రామస్తులంతా ఏకధాటిపై గ్రామంలో డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా గ్రామ పురవీధుల గుండా బొడ్రాయి (నాభి శిల) ప్రతిష్టాపనకు వైదికంగా బ్రహ్మశ్రీ కొండగడప హరిప్రసాద్ శర్మ పురోహితులు కాశీ లక్ష్మణ శర్మ ఆధ్వర్యంలో నాభిశిల సుబ్రమణ్య స్వామి ప్రతిష్టాపన కార్యక్రమలో గణపతి పూజ మంగళతోరణాలు పుణ్యాహవచనం రక్షాధారణ మండప పూజలు జలాభిషేకాలు అగ్ని మదన కార్యక్రమం ప్రత్యేక పూజలు చేశారు.

మహిళలు నూతన వస్త్రాలు ధరించి ఇంటింటికి జలబిందులతో బొడ్రాయికి మంగళహారతులు కొబ్బరికాయలు జలాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి వ్యవసాయమార్కెట్  కమిటీ వైస్ చైర్మన్ చింతరెడ్డిరాజగోపాల్ రెడ్డి చిల్లర చంద్రమౌళి గోడిశాల యాదగిరి కన్నెబోయిన యాదగిరి బిక్షపతి యాదగిరి వెంకన్న శ్రీనివాస్ ప్రవీణ్ నాగార్జున మహేష్ రమేష్ వెంకన్న ఆచార్యులు శేషగిరి వేణు శాస్త్రి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.