15-08-2025 12:10:15 AM
చిన్న చింతకుంట ఆగష్టు 14 : మండల కేంద్రంలో బస్టాండ్ కల నెలవేరడం లేదు. ఏళ్ల తరబడి వేచి చూసినా ఆ దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ చొరవ చూపడం లేదు. బస్టాండ్ కల కలగానే మిగిలిపోయేలా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నా బస్టాండ్ నిర్మాణం చేపట్టడం లేదు. స్థానికంగా ఎన్నికలప్పుడు మాత్రమే బస్టాంఢ్ అంశాన్ని ప్రచారం సాధనంగా ముందుకు తీసుకొస్తున్నారు.
తప్ప ఆ తర్వాత పలు కారణాలు చూపుతూ బస్టాండ్ నిర్మాణంలో జాప్యం వహిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్తులకు బస్టాండ్ లేక వేసవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం గంటలకొద్ది వేచి ఉండాల్సి వస్తుందని,కనీసం 5 నిమిషాలు ఎక్కడ కూర్చోవాలో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
మండల కేంద్రానికి వచ్చి ప్రయాణించాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ప్రతినిత్యం వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చి జిల్లా కేంద్రాలకు, పట్టణాలకు, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాలంటే బస్సులు, వాహనాల కోసం గంటల తరబడి రోడ్డుపై బస్సుల కోసం ప్రయాణికులు వేసి చూస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం, స్థానిక ప్రజా ప్రతినిధులు బస్టాండ్ కొరతను తీర్చాలని, ప్రయాణికుల చిరకల కలను నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల సౌకర్యార్థం టాయిలెట్లను ఏర్పాటు చేయాలి.
మండల కేంద్రానికి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్సు ప్రయాణానికి వచ్చే ప్రజలకు, ప్రయాణికులకు మూత్రశాలలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా మహిళలకు టాయిలెట్లు లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని ప్రయాణికులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రయాణికుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని సమస్య పరిష్కారానికి అనువైన స్థvలంలో మూత్రశాలల ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
బస్టాండ్ సౌకర్యం కల్పించండి
గత 40 ఏండ్ల నుండి మండల కేంద్రంలో బస్టాండ్ సౌకర్యము లేదు. మండల కేంద్రం నుండి వివిధ గ్రామాలకు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఊరి చివర గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్, మరియు ఎమ్మార్వో ఆఫీస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలవు ఇక్కడ గర్భిణీ స్త్రీలు మండల ఆఫీసుకు వచ్చే ఫిర్యాదారులు బస్సు లు ఆపడం లేదు అని పలుమార్లు ఆర్టీసీ అధికారులకు కోరినప్పటికీ వారు స్పందించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.
గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వచ్చే.గర్భిణీ స్త్రీలు గాని వికలాంగులు , వృద్ధులు మెయిన్ రోడ్డు ప్రక్కన ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గరికి వెళ్లి బస్సు ఎక్కడం జరుగుతుంది. మండల కేంద్రంలో బస్టాండు మరియు ఊరి చివర రిక్వెస్ట్ బస్ స్టాప్ కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నాం.
వాకిటి మధు, సీసీ కుంట మండలం,
మహబూబ్ నగర్ జిల్లా