calender_icon.png 15 August, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల జాడ ఎక్కడ..?

15-08-2025 12:33:25 AM

- హోటల్‌లు దుకాణాలపై దాడులు శూన్యం

- కాలం చెల్లిన, నాణ్యత ప్రమాణాలు లేని ఆహారం,మాంసం విక్రయాలు 

- పలు దుకాణాలలో కాలం చెల్లిన వస్తువుల అమ్మకం

- తూతూ మంత్రంగానే అధికారుల దాడులు

- మామూళ్ల మత్తులో అధికారులు

- కల్తీ ఆహారానికి అడ్డుకట్ట పడేనా...?

బాన్సువాడ, ఆగస్టు 14 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా కల్తీ ఆహారం కూలిన మాంసం కాలం చెల్లిన వస్తువుల విక్రయం రోజు రోజుకు జోరుగా సాగుతుంది. కల్తీ వస్తువులపై ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన దాడులు చేపట్టక పోవడంపై అధికారుల జాడ ఎక్కడ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాలోని ఏ హోటల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు దుకాణాల్లో కాలం చెల్లిన వస్తువులు ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు లేకుండా విచ్చలవిడి గా విక్రయాలు చేపడుతూ ధనార్జన దేయంగా పలువురు వ్యాపారులు దందాను కొనసాగిస్తున్నారు.

అంతేకాకుండా కల్తీ వస్తువుల విక్రయం కల్తీ ఆహారం హోటల్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లతో పాటు దుకాణాలపై ఎప్పటికప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించని దుకాణాలు హోటల్ పై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పత్తా లేకుండా పోయారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు. ప్రజలు ప్రతినిత్యం హోటల్లు పాస్పోర్ట్ సెంటర్లలో వేల సంఖ్యలో ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తుంటారు కల్తీ నూనెతో పాటు కల్తీ ఆహార పదార్థాలను వండి ప్రజలకు నాణ్యత లేని ఆహారాన్ని అందించడంతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి.

ఫుడ్ ఇన్స్పెక్టర్లు జిల్లాలో ఎక్కడ కనబడడం లేదని ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడం ఒకవేళ దాడులు చేసిన తూతూ మంత్రంగా దాడులు చేపట్టి మామూలుగా మత్తులో జరుగుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ అయినటువంటి వస్తువులను కూడా కూల్ డ్రింక్స్ ఆహార పదార్థాలను కూడా విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్లు జిల్లాలో దాడులు చేపట్టి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలను వస్తువులను విక్రయించేలా దాడులు చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు. 

కాలం చెల్లిన మాంసం విక్రయం..

 కామారెడ్డి జిల్లాలో ఏ హోటల్ లో చూసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చూసిన ఇతరత ఆహార విక్రయ కేంద్రాల్లో చూసిన కాలం చెల్లిన మాంసం కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి అంతే కాకుండా రెండు మూడు రోజుల నిల్వ ఉన్న మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టి తిరిగి ప్రజలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు కూడా ఎన్నో ఉన్నాయి అయినా అధికారులు మాత్రం దుకాణాల వైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తు న్నాయి.  ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు దాడులు చేపట్టడం లేదని ఆరోపణలు కూడా వినపడుతున్నాయి దాడులు చేపట్టకపోవడం లో అంతర్వేమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా దాడులు చేపట్టి ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని వస్తువులను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

తూ... తూ... మంత్రంగానే దాడులు

ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ప్రజలు కల్తీ ఆహారంపై కాలం చెల్లిన వస్తువులపై ఫిర్యాదు చేసిన కేవలం అధికారుల పర్యటన నిమిత్తం తూతూ మంత్రంగా దాడులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాకుండా జరిమానా విధించాల్సిన దుకాణాలపై జరిమానాలు విధించ కుండా పువ్వపత్రము తీసుకొని మామూళ్ల మత్తులో జోకుతున్నారని విమర్శలు లేకపోలేదు. ఇంత జరుగుతున్న దాడులు ఎందుకు చేయడం లేదని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా దాడులు చేపట్టి ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు. 

కల్తీ ఆహారాన్ని, కాలం చెల్లిన వస్తువుల విక్రయానికి అడ్డుకట్ట పడేనా...!

కల్తీ ఆహారాన్ని కాలం చెల్లిన వస్తువులను దుకాణాల్లో విక్రయించకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అధికారులు అడ్డుకట్ట వేసిన అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు జిల్లాలోని అన్ని ప్రాం తాలలో హోటల్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బేకరీ చాయ్ హోటల్లు కిరాణా దుకాణాలు ఇతరత్రా అన్నిచోట్ల తనిఖీలు చేపట్టి నాణ్యత ప్రమాణ పాటించని దుకాణాలపై చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని ఎప్పటికప్పుడు దాడులు చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.