calender_icon.png 8 January, 2026 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సుడా చైర్మన్

05-01-2026 01:15:20 AM

కరీంనగర్, జనవరి 4 (విజయ క్రాంతి): నగరంలో పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. రేకుర్తి డివిజన్ లో అంబేద్కర్ చౌరస్తా నుండి సమ్మక్క కు వెళ్లే రోడ్డు 15 లక్షలతో 200 మీటర్ల మేర సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం హుస్సేనీ పురాలో 33 వ డివిజన్, 32 డివిజన్ కొంత భాగం మెయిన్ రోడ్డు వరకు 15 లక్షలతో 200 మీటర్ల మేర సిసి రోడ్డు నిర్మాణం కొరకు మరో 5 లక్షలతో ఇరువైపుల మురుగు కాలువ నిర్మాణా నికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం నిరంతర ప్రక్రియ అని, పది సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారని అన్నా రు. డిఈ రాజేంద్ర ప్రసాద్, ఎఈ సతీష్, అ జల్ కాంగ్రెస్ నాయకులు రహ్మత్ హుస్సేన్, ఎండి తాజ్, జక్కుల నాగరాణి, ఎండి చాం ద్, రమేష్, తిరుమల, షబానా మహమ్మద్, లయక్, సయ్యద్ ఖలీల్, ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి, చంద్రయ్య, ప్రవీణ్, గణేష్ ప్రసాద్ రెడ్డి, భారీ, బషీర్, మాసూమ్‌ఖాన్, ముల్కల కవిత, షెహన్షా, జాఫర్ పాల్గొన్నారు.