calender_icon.png 13 December, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

11-12-2025 12:00:00 AM

ఎస్పీ నరసింహ

సూర్యాపేట, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : జిల్లాలో నేడు జరగనున్న మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో సిబ్బంది క్రమశిక్షణగా అప్రమత్తత, క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మండల పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న పోలీసు సిబ్బందికి పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్లో బుధవారం, విధుల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసు శాఖ పాత్ర అత్యంత కీలకమన్నారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా పూర్తి అంకితభావంతో పనిచేయాలన్నారు. కేటాయించిన విధులను, విధి ప్రాంతాలను పనులు పూర్తయ్యే వరకు వదలవద్దన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమబద్ధంగా నియంత్రించాలన్నారు.

అనుమతి లేని వ్యక్తులను కేంద్రాల పరిసరాల్లోకి అనుమతించరాదని, 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ఈ విషయంలో సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి అధికారి, సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) తప్పనిసరిగా పాటించాలన్నారు.

విధుల నిర్వహణలో తలెత్తే సమస్యలు లేదా ఇబ్బందులను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలంటే సమన్వయంతో పనిచేయాలన్నారు.  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.