calender_icon.png 13 December, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాధా గోవిందుల రథయాత్ర

11-12-2025 12:00:00 AM

హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో 13న పవిత్రోత్సవం

భక్తులకు ప్రత్యేక ఆహ్వానం

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరా బాద్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13న నాలుగో వార్షిక శ్రీ శ్రీ రాధా గోవిందుల రథయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు. సుందరంగా అలంకరించిన రాధా గోవిందుల విగ్రహాలు గండిపేట వై జంక్షన్ సమీపంలోని శ్రీ కృష్ణ గో సేవా మండల్ గోశాల నుంచి సాయం త్రం 4:30 గంటలకు మొదలై నార్సింగి, కోకాపేట్ ప్రాంతంలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వరకు రథయాత్ర కొనసాగనుం ది.

సాయంత్రం 5, 7 గంటల మధ్య కోకాపేట్ ప్రాంతం గుండా రథం పయనిస్తూ అల్లూ స్టూడియోస్  7 హిల్స్ రోడ్ రాజపుష్ప ఆత్రియా  గోల్డెన్ మైల్ రోడ్  మార్గం లో రథయాత్ర కొనసాగుతుంది. మార్గమధ్యలోని నివాసులు రథాన్ని దర్శించి, పూజలు చేసి, రథాన్ని లాగే సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 7 గంటలకు హెరిటేజ్ టవర్ చేరుకున్న తర్వాత మెగా కీర్తనాలు, హరే కృష్ణ మూవ్ మెంట్, హైదరాబాద్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభూ వారి ప్రత్యేక ప్రవచనం ఉంటుంది. ఈ మేరకు భక్తులు తరలిరావాలని సత్యగౌర చంద్రదాస ప్రభూ స్వాగతం పలుకుతున్నారు. బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు.