11-05-2025 02:00:04 AM
- ఢిల్లీ తెలంగాణ భవన్‌లో అన్ని ఏర్పాట్లు
- ఆహారం, వసతి, మెడికల్ క్యాంపు, రవాణాసౌకర్యం
- 24 గంటలు అందుబాటులో కంట్రోల్ రూం
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దులో చిక్కుకుపోయిన తెలం గాణవాసులకు ఆవాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు లో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగం గా 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 30 మంది నుంచి కాల్స్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
శిబిరంలో ఆశ్రయంలో పొందే వారికి కావాల్సిన ఆహారం, వసతులను ఏర్పాటు చేశారు. బాధితులకు తక్షణమే వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపు, వారిని భద్రం గా విమానాశ్రయానికి, రైల్వేస్టేషన్‌కు తరలించేందుకు రవా ణా సౌకర్యం కల్పిస్తున్నారు.
సరిహద్దు జిల్లా ల నుం చి వచ్చే కాల్స్ అనుగుణంగా వెంటనే రక్షణ చర్యలు చేపట్టేలా సమన్వ యం చేస్తున్నారు. దీంతోపాటు ఎప్పటిక ప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ భవన్‌లోని ఏర్పాట్లను రెసిడెంట్ కమిషనర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.