21-05-2025 12:00:00 AM
ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి
ఆదిలాబాద్, మే 20 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూన్ 6,7,8 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని జిల్లా ఒలంపి క్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హాకీ టోర్నమెంట్ నిర్వహణ తీరుపై సమీక్ష సమా వేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ టోర్నమెంట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుండి హాకీ క్రీడకారుల టీమ్‌లు హాజరుకానున్నాయని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే టోర్నమెంట్‌లో క్రీడాకారులకు అన్ని వసతులు ఏర్పా టు తో పాటు టోర్నమెంట్‌ను విజయవం తం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి, తీర్మానం చేయడం జరిగిందన్నారు.
అధికారులు, క్రీడా అభిమానులు, పట్టణ ప్రజలు సహకరించి టోర్నమెంట్ విజయవంతం చేసేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, పలువురు హాకీ కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.