21-05-2025 12:00:00 AM
టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే20( విజ యక్రాంతి): ఉపాధ్యాయులకు మూడు విడుతలుగా ఐదు రోజులపాటు నిర్వహిస్తున్న సబ్జెక్టు శిక్షణ శిబిరాల్లో భాగంగా రెండో విడత ప్రారంభమైన శిబిరాలలో మౌలిక వసతులు కల్పించాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి డిమాండ్ చేశారు. సంఘం నాయకులతో కలిసి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో కనీస వసతులు కల్పించకపోవడం సరైనది కాదన్నారు. ప్రస్తు తం ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో శిక్ష ణ కేంద్రాల్లో కనీసం ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడం, ఉన్న ఫ్యాన్లు తిరగకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అన్ని శిక్షణ కేంద్రాలలో కూల ర్లు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉం చాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యు టిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రీతి, జిల్లా కార్యదర్శి మహిపాల్, జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్, వామన్, గుణాకర్ పాల్గొన్నారు.