20-12-2025 03:18:40 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): ఏరుకొండ అబ్బయ్య గౌడ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలం తో దూషిస్తూ మాట్లాడడం తప్పు అని బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ సర్పంచ్ చెరుకు లింగం గౌడ్ అన్నారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులను దూషిస్తూ ఏరుకొండ అబ్బయ్య మాట్లాడడం సరైనది కాదన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన అతను గౌడ కులస్తులు తనకు వేయలేదని ఆరోపిస్తూ దూషించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బేషరతుగా గౌడ కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .ఇందుర్తి గౌడ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయితగోని మారయ్య గౌడ్ అశోక్ గౌడ్ చెరుకు యాదగిరి గౌడ్ రమేష్ గౌడ్ శివ గౌడ్ అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.