calender_icon.png 19 May, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ బిల్లులపై సర్‌చార్జి పెంచాల్సిందే

19-05-2025 01:32:46 AM

  1. 17,600 బిలియన్ డాలర్ల ఫెడరల్ బడ్జెట్ ఆమోదించాలి
  2. మూడేండ్ల కంటే పాతవైన కార్ల దిగుమతులపై ఆంక్షలు తొలగించాలి
  3. గ్యాస్ చార్జీలనూ సవరించాలి
  4. పాక్‌కు కొత్తగా ౧౧ షరతులు విధించిన ఐఎంఎఫ్ 
  5. 50కి చేరుకున్న షరతుల సంఖ్య

ఇస్లామాబాద్, మే 18: ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న దాయాది పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరో షాక్ ఇచ్చింది. భారీ అప్పు కోసం ఐఎంఎఫ్ వద్ద చేయి చాచిన పాక్‌కు ఆ సంస్థ కొత్త షరతులు విధించింది. ఇప్పటికే పలు షరతులను ఆచరణలో పెట్టిన పాక్‌కు మరో 11 షరతులు విధించింది. ఆచరణలో పెడితేనే పాక్‌కు బెయిలౌట్ ప్రోగ్రా మ్ కింద తదుపరి నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపింది.

దీంతో కొత్త షరతులతో కలిపి ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరుకుంది. పాకిస్థాన్‌కు బెయిల్ ఔట్ ప్రోగ్రాం కింద తదుపరి విడుత నిధులు కేటాయించేందుకు ఈ షరతులు పాటించాలని తెలిపింది. రూ. 17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు కేంద్ర పార్లమెంట్ ఆమోదం తెలపాలి.

విద్యుత్ బిల్లులపై రుణసేవల సర్‌చార్జి పెం పు, మూడేళ్లకు మించి ఉపయోగించిన కార్ల దిగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించాలని సూచించింది. అంతే కాకుండా భారత్‌తో ఉద్రిక్తత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదంగా మారనుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. 

షరతులివే.. 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి 17,600 బిలియన్ డాలర్ల ఫెడరల్ బడ్జెట్‌ను పాక్ పార్లమెంట్ ఆమోదించాలి

విద్యుత్ బిల్లులపై సర్ చార్జి పెంచాలి.. యూనిట్ ధర రూ. 3.21ని తొలగించాలి

మూడేండ్ల కంటే పాతవైన కార్ల దిగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగించాలి

పన్ను రిటర్నింగ్ ప్రాసెసింగ్, పన్ను చెల్లి ంపుదారుల గుర్తింపు, నమోదు, కమ్యూనికేషన్ క్యాంపెయిన్.. నాలుగు ప్రావి న్సులు కొత్త వ్యవసాయ ఆదాయ పు పన్ను చట్టాలు అమలు చేయాలి

ఫిబ్రవరి 15 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలి

2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను తొలగించేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలి 12 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్ ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ రూ. 2,414 కోట్లుగా ఉండనుంది.

ఈ బడ్జెట్ ప్రస్తుత బడ్జెట్‌తో పోలిస్తే 12 శాతం మేర ఎక్కువ కావడం గమనార్హం. ఐఎంఎఫ్ వి ద్యుత్ రంగంలో ౪కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఐఎంఎఫ్ నుంచి పాక్‌కు ఇప్పటికే 1 బిలియన్ అమెరికన్ డాలర్ల నిధులు మంజూరయ్యాయి. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఈఎఫ్) కింద నిధులు మంజూరు చేసేందుకు ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది.