03-07-2025 01:33:57 AM
రీయింబర్స్‌మెంట్ అర్హులైన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దన్న ఉన్నత విద్యామండలి
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు వసూలు చేయొద్దని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఆయా యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఈమేరకు ఆదేశాలివ్వాలని పేర్కొంది. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరుతున్న విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజును ఆయా కాలేజీలు వసూలు చేస్తున్నాయని అధికారులకు ఫిర్యాదులందడంతో రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని హెచ్చరించింది.