calender_icon.png 4 July, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టు 10న అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ ఎంట్రన్స్

03-07-2025 01:32:29 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఆగస్టు 10న డా. బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 15 అని పేర్కొన్నారు. ఆగష్టు 10న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు తెలంగాణ రాష్ర్టంలో ఉన్న నిర్దిష్ట పరీక్షా కేంద్రాల్లో మాత్రమే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తారని పేర్కొన్నారు.

ఐ-సెట్ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎంబీఏ  కోర్సుల్లో అడ్మిషన్స్ పొందొచ్చని వెల్లడించారు. లేకుంటే అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహించే ఎంబీఏ, ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్-2025లోనైనా అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశం పొందొచ్చన్నారు.