calender_icon.png 18 October, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెప్మా సిబ్బందిపై వేటు

15-10-2025 12:00:00 AM

నిర్మల్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మెప్మాలో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఇద్దరిపై వేటుపడినట్లు అధికారులు తెలిపారు. మెప్మా పీడీగా విధులు నిర్వహిస్తున్న సుభాష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఆయనను హైదరాబాద్ ప్రధాన కార్యానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. నిర్మల్ పట్టణంలో మెప్మాలో ఆర్పీగా విధులు నిర్వహి స్తున్న సైరాబాను అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగి స్తూ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు నిర్మల్ జిల్లా కేంద్రంలో మెప్మాలో అవినీతి ఆక్రమణలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకో వడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు