20-10-2025 01:17:03 AM
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజలింగు హెచ్చరిక
ఆదిలాబాద్, అక్టోబర్ 1౯ (విజయక్రాం తి): బాలలను పనిలో పెట్టుకుంటే సదరు సంస్థల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజ లింగు అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ రామ్ లీలా మైదా నంలో ఏర్పాటు చేసిన టపాసుల షాప్స్ వద్ద ఆదివారం షూర్ ఎన్జీవో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజలింగు, జిల్లా బాల ల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, వన్ టౌన్ ఎస్.ఐ సయ్యద్ ఇసాక్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లేబర్ ఆఫీసర్ మాట్లాడుతూ...18 ఏళ్ల లోపు పిల్లలను పని లో పెట్టుకోవద్దని సూచించారు. క్రాకర్స్ షా ప్స్ ప్రమాదకరమైనవనీ పిల్లలను పనుల్లో పెట్టుకున్న సంబంధిత షాప్ యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
అను కొని సంఘటన జరిగితే బాలలకు ఇబ్బందులు వస్తాయన్నారు. రెండు రోజుల పాటు శాఖ తరపున ఇక్కడ తనఖీలు చేస్తామన్నా రు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ అధికారి మాట్లాడుతూ... బాలలను రక్షణ సంరక్షణ కల్పించేందుకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం పనిచేస్తుందన్నారు.
ఆపదలు ఉన్న పిల్లల కోసం చైల్ హెల్ప్ లైన్ 1098, 100 కి నెంబర్ సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రాకర్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేందర్, షూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ కె. వినోద్, ఫీల్ సూపర్వైజర్లు కిరణ్, సౌజన్య , చైల్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ అనిల్, కేస్ వర్కర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.