20-10-2025 01:18:56 AM
కుటుంబ సమేతంగా స్వామినీ దర్శించుకున్న కలెక్టర్
ఆదిలాబాద్, అక్టోబర్ 1౯ (విజయక్రాం తి): పురాతన ప్రాచీన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జైనథ్‌లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నారా యణ స్వామి ఆలయాన్ని ఆదివారం కుటుం బ సభ్యులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కలెక్టర్ కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసా దం అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ మేరకు ఆలయ చరిత్ర, పురాతనత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతపై పూజారి వివరించారు. అనంతరం ఆలయ ప్రాంగణం, పరి సరాలను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడు తూ... భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిశుభ్రత, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పచ్చదనం పెంపు, అందమైన వసతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారు లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.