25-07-2025 12:08:33 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని మీరాలం చెరువుపై నిర్మించతలపెట్టిన ఐకానిక్ వంతెనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.430 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ వంతెనను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. బెంగుళూరు హైవేను కలుపుతూ శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ రోడ్డుకు అనుసంధానంగా వంతెన నిర్మించనున్నారు.