30-10-2025 01:02:45 AM
వైద్యం అందక రోగి మృతి చెందరానే విషయాన్ని ఖండించిన రిమ్స్ డైరెక్టర్
ఆదిలాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మహి ళ మృతి చెందడంలో రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం లేదని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ స్పష్టం చేశారు. బుధవారం తన ఛాంబర్లో వైద్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బేలా మం డలం సదల్పూర్ గ్రామానికి చెందిన టీకం పోతుభాయి అక్టోబర్ 6న రిమ్స్లో చేరినట్లు తెలిపారు.
ఆమెకు అక్టోబర్ 7న సీటీ స్కాన్, 11న ఎంఆర్‌ఐ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మహిళ పరిస్థితిని స్వయంగా పరిశీలించానని, మెరుగైన చికిత్స అందించాలంటూ జనరల్ మెడిసిన్ విభాగ వైద్యులకు సూచించినట్లు తెలిపారు. వ్యాధి పూర్తి నిర్ధారణ కోసం కాంట్రాస్ట్ ఎంఆర్‌ఐ అవసరమని రేడియాలజీ నిపుణులు సూచించగా, ఆ ఇంజక్షన్ సాధారణంగా అరుదుగా ఉపయోగించే ఔషధమని చెప్పారు.
ఆ ఔషధం కోసం హైదరాబాద్లోని ఏజెన్సీలను సంప్రదించినప్పటికీ వరుస సెలవుల కారణంగా సరఫరా ఆలస్యమైందని వివరించారు. అయితే మానవతా దృక్పథంతో వెంటనే చర్యలు తీసుకొని ఆ ఔషధం ఆసుపత్రిలో అందుబాటులో ఉండే లా రిమ్స్ యాజమాన్యం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కానీ కుటుంబ సభ్యులు సదరు మహిళను ఇంటికి తీసుకెళ్లారని, అనంతరం ఆరోగ్యం క్షేనించి ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మహిళా మృతి చెందడం కంటే ముందే ఔషధం లభ్యమైందని కుటుంబానికి రిమ్స్ యాజమాన్యం సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వయంగా సదరు మహిళ గ్రామానికి వెళ్లి రోగి కుటుంబానికి వివరాలు తెలియజేసి, రిమ్స్లోనే చికిత్స కొనసాగించవచ్చని కుటుంబానికి సూచించినట్లు డైరెక్టర్ తెలిపారు. అయినవారు వారు తిరిగి ఆసుపత్రికి రాలేదన్నారు. ఈ సమావేశంలో పలువురు రిమ్స్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.