calender_icon.png 31 October, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తహశీల్దార్ ఉష

30-10-2025 01:01:39 AM

ఎర్రుపాలెం అక్టోబర్ 29 ( విజయ క్రాంతి) :మెంత తీవ్ర తుఫాన్ ప్రభావంతో మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ ఎం ఉషా శారద సూచించారు. మండలంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మన ప్రక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నందువలన ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈరో జు, రేపు కూడా మండల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఉంటాయని భారీ వర్షాలకు వాగులు, కాలువలు ఉదృతంగా ప్రవహిస్తాయని ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళద్దని తెలిపారు. కరెంటు తీగలకు దూరంగా ఉం డాలని,ఇళ్ల నుండి బయటకు రావద్దని ఏదై నా అత్యవసర పరిస్థితిలలో రెవెన్యూ సిబ్బందికి, గ్రామాల్లో ఉన్న జిపిఓలకు, పంచా యతీ కార్యదర్శులకు తెలియజేయాలని పేర్కొన్నారు. మండలంలో మెంత తుఫాన్ దృష్ట్యా వాగులు వంకలు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరూ అ ప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీస్ సిబ్బందికి సమాచారాన్ని తెలియజేయాలని ఎస్త్స్ర రమేష్ మండల ప్రజలకు సూచించారు