calender_icon.png 26 August, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తజికిస్థాన్‌లో భూకంపం

13-04-2025 10:57:09 PM

దుశాంబే: సెంట్రల్ ఆసియా దేశమైన తజికిస్థాన్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.9 పాయింట్లు నమోదయ్యాయి. అలాగే మయన్మార్‌లోనూ భూప్రకంపనలు కలకలం రేపాయి. మైక్టిలా నగరంలో తీవ్రత కనిపించిందని అమెరికన్ జియాలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది. ఇక్కడ తీవ్రత 5.5గా నమోదైందని పేర్కొన్నది. రెండు దేశాల్లో ప్రాణ, ఆస్తినష్టంపై ఇప్పటివరకు అక్కడి ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.